ఆయన రొక్కం కిరణ్‌కుమార్‌( స్నేక్‌ పార్క్‌ పెట్టే)

సక్సెస్ న్యూస్
ప్రజల్లో పాములు పట్ల అవగాహన కలిగించుకోవాలి

విశాఖపట్నం;పాములంటే ప్రమాదకరమైనవని భావించి కొట్టి చంపే విష సంస్కృతి ప్రస్తుత సమాజంలో నెలకొంది. కాగా పాములను చంపరాదని, పాములన్నీ ప్రమాదకరమైనవి కావని, పాముల పట్ల ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఓ యువకుడు చేస్తున్న కృషిని పలువురు అభినందిస్తున్నారు. విశాఖ జిల్లాలో స్నేక్‌క్యాచర్‌గా ఆయన సుపరిచితుడు. పాముల పట్ల ప్రజలు విచక్షణారహితంగా వ్యవహరించకూడదని ఆయన అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో ఎక్కడ ఎవరి ఇంట్లో పాములు ఉన్నట్లు సమాచారం అందించినా అక్కడకు ఆయన చేరుకుని ఆ పామును వధించకుండా పట్టుకుని ప్రజల్లో గల భయాందోళనలను రూపుమాపుతున్నారు.మూగ జీవాల పట్ల కరుణ చూపాలని ఆయన ప్రజలను అభ్యర్ధిస్తున్నారు. ఇంతకీ ఆయన విశాఖపట్టణం మింది గ్రామానికి చెందిన రొక్కం కిరణ్‌కుమార్‌. ఆయన సక్సెస్ న్యూస్ తొ  తన అనుభవాన్ని, భవిష్యత్‌ కార్యాచరణను వెల్లడించారు. గత ఆరు సంవత్సరాలుగా జిల్లాలో పాములను చంపకుండా పట్టడమే ప్రధాన ఆశయంగా ఆయన ముందుకు సాగుతున్నారు.
దీనికి ఆయన పైసా కూడా ప్రతిఫలం ఆశించడం లేదు. ఉచితంగా ఆయన ఈ సేవలను అందిస్తూ ప్రజల్లో పాముల పట్ల గల భయాందోళ లను పారద్రోలేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటి వరకూ 4,500 పాములు (అన్నిరకాలు పాములను) పట్టుకున్నారు. పట్టుకున్న ఈ పాములను మధురవాడ దరి తిమ్మాపురం వద్ద గల జనసంచారం లేని ప్రదేశంలో వాటిని వదులుతున్నట్లు ఆయన   సక్సెస్ న్యూస్ కు తెలిపారు. విశాఖపట్టణం స్టీల్‌ ప్లాంట్‌లో ఆయన సుమారు 2000కు పైగా పాములను పట్టుకుని అక్కడి ప్రజల్లో భయాందోళనలను రూపుమాపారు. రోజుకు 5నుంచి10 పాములను పడతానని ఆయన తెలిపారు. పాముల పట్ల ప్రజల్లో అవగాహన కలిగించేందుకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తానని, అదే విధంగా విశాఖపట్టణంలో స్నేక్‌ పార్క్‌ పెట్టే ఆలోచన ఉందని ఆయన  సక్సెస్ న్యూస్  కు వివరించారు. 

తన తండ్రి షిప్‌యార్డులో ఇటీవల రిటైర్‌ అయ్యారని, తాను ఉద్యోగస్తుల కుటుంబానికి చెందిన వ్యక్తిని మాత్రమే కాకుండా రాజకీయ నేపధ్యం గల కుటుంబానికి చెందినవాడినన్నారు. మిందిలో ప్రముఖ రాజకీయ నాయకుడు గుడివాడ గురునాధరావు పిన్ని తనయుడినని ఆయన తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌లో తాను చేసిన సేవలను గుర్తించి అక్కడి ఉద్యోగస్తులందరూ ఆదివారం తనకు సెక్టార్‌1లో ఒక క్వార్టర్‌కూడా కేటాయించారని ఆయన తెలిపారు. పాములను వధించకుండా పట్టుకుని, పాముల పట్ల ప్రజల్లో ఉన్న అపోహల్ని తొలగించి వారికి సరియైన విధంగా సరియైన విధంగా అవగాహన కలిగించడమే ధ్యేయంగా తాను కృషి చేస్తానని కిరణ్‌కుమార్‌ తెలిపారు. తాను చేపట్టనున్న కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. ఎక్కడ ఎవరింట్లో, ఏషాపుల్లో పాములు ఉన్నాయని భావిస్తే తన నంబర్‌ను సంప్రదిస్తే సకాలంలో వచ్చి సేవలు అందిస్తానని ఆయన తెలిపారు. ఆయన సెల్‌ నెంబర్‌ 9849140500.
****************************************************************************

Snake Catcher Vizag
Contact Name : Kiran Kumar -
Area : Gajuwaka, Vizag
Address : Gajuwaka, Visakhapatnam., Visakhapatnam
Cell Number: 9849140500,9494665926
We are Snake Catchers giving free services in Catching Snakes

anyone facing problem with snakes in their house or garden please contact us we will find the snake and take the snake with us and leave at city outskirts


Keywords/Tags: Snake Catcher, Snake Catching, Snake Catching in Home, Snake Catcher in Gajuwaka, Andhra Snake Catcher,
**********************************************************************************